Breaking News

అఫీషియల్‌: ఓటీటీలో 'కూలీ' రిలీజ్‌ ఎప్పుడంటే?

Published on Thu, 09/04/2025 - 14:24

రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్‌ నుంచి నాగార్జున, బాలీవుడ్‌ నుంచి ఆమిర్‌ ఖాన్‌, మాలీవుడ్‌ నుంచి సౌబిన్‌ షాహిర్‌, సాండల్‌వుడ్‌ నుంచి ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణంతో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ను అందుకుంది. టాక్‌ సంగతి ఎలా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

ఓటీటీ డేట్‌ వచ్చేసింది
అయితే వెయ్యికోట్ల మైలురాయి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 11న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ వదిలారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి రానుందని తెలిపారు. అయితే హిందీ రిలీజ్‌ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్‌ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందని తెలుస్తోంది.

సినిమా
కూలీ సినిమా విషయానికి వస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా నటించాడు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించాడు. శృతి హాసన్‌, సత్యరాజ్‌, రచిత రామ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్‌ పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు.

 

 

చదవండి: అల్లు అర్జున్‌ సినిమాలో యాక్ట్‌ చేశా.. నా భార్య తిట్టింది: నిర్మాత

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)