Breaking News

చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్‌

Published on Wed, 06/04/2025 - 19:17

ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేమంటారు. అలాంటిది దిగ్గజ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) వరుసగా నోరు జారుతూనే ఉన్నాడు. ఆ మధ్య క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ను, ఇటీవల కమెడియన్‌ అలీని తిట్టాడు. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌పైనా నోరు పారేసుకున్నాడు.

నాకు ప్రేమలే తెలుసు
పదేపదే మాట తూలుతూ రాజేంద్రప్రసాద్‌ తన పరువు తనే గంగలో కలిపేసుకుంటున్నాడని అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై రాజేంద్రప్రసాద్‌ స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్‌గా ఎలా ఉంటాను?

నా చివరి శ్వాస వరకు..
కానీ నాపై వచ్చిన విమర్శలు చూసి ఈ సారి చాలా హర్టయ్యాను. జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నాను. నందమూరి తారకరామారావు పిల్లలనుంచి పెద్దలవరకు అందరినీ మీరు అనే సంభోదించేవారు. నేను కూడా ఇకపై అలాగే మాట్లాడతాను. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను. జీవితంలో ఇంకెప్పుడూ ఏకవచనంతో మాట్లాడను. 

కెమెరాలు చూసుకోలేదు..
ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే అంటే పర్సనల్‌ ఫంక్షన్‌ అనుకున్నాను. కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే.. వాళ్లందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్‌ వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్‌ చూస్తే మీకు అర్థం కాదు. అయినా నేటి సోషల్‌ మీడియా యుగంలో పాతరోజుల్లోలాగా ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదు. లిమిట్స్‌లో ఉండటం బెటర్‌ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవర్నీ నువ్వు అనను, మీరు అనే అంటాను అని రాజేంద్రప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)