Breaking News

చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమే నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్‌

Published on Tue, 10/17/2023 - 13:12

కామెడీ హీరోగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌. కామెడితో హీరోయిజం కూడా పండించొచ్చని నిరూపించిన ఏకైక నటుడు ఆయన. ఇప్పుడంటే చాలా మంది కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు కానీ.. అప్పట్లో రాజేంద్రప్రసాద్‌ ఒక్కరే కామెడీ హీరో.

నవ్వుల రారాజుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 ఏళ్లుగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నట కిరీటీ సపోర్టింగ్‌ యాక్టర్‌గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తెరపై నవ్వులు పూయించిన ఈ సీనియర్‌ హీరో.. రియల్‌ లైఫ్‌లో మాత్రం చాలా కష్టాలు అనుభవించాడట. తాజాగా ఆయన ఓ టీవీ షోలో పాల్గొని..తన చిన్ననాటి కష్టాలను తెలియజేస్తూ ఎమోషనల్‌ అయ్యాడు.

‘నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను అమ్మకోసం ఎదురుచూస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. రోజు అమ్మకోసం ఏడ్చేవాడిని. ఒకనొక దశలో చనిపోయే స్టేజ్‌కి వచ్చాను. అప్పుడు నా పరిస్థితి చూసి..మా ఇంట్లోవాళ్లు కనక దుర్గమ్మ గుడికి తీసుకెళ్లారు. అమ్మవారిని చూపిస్తే.. ఇకపై ఈమే నీ అమ్మ అని చెప్పారు. అమ్మ బయటకు రాదు..ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ కనకదుర్గమ్మనే అమ్మగా భావించి పెరిగాను’ అని చెబుతూ రాజేంద్రప్రసాద్‌ భావోద్వేగానికి గురయ్యారు. 

రాజేంద్ర ప్రసాద్‌ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన  ‘#కృష్ణారామా’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమి కీలక పాత్ర పోషించింది. అక్టోబర్‌ 22న ప్రముఖ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)