ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు
Breaking News
జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్
Published on Wed, 06/25/2025 - 07:33
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన.. ఈ చిత్రంతో పాన్ వరల్డ్‌లోనూ తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఎవరూ ఊహించని పనిచేసి జక్కన్న వార్తల్లో నిలిచాడు. ఓ జపనీస్ వీడియో గేమ్‌లో కనిపించి భారతీయ నటీనటులు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఇంతకీ ఏంటా గేమ్? అసలేం జరిగింది?
'ఆర్ఆర్ఆర్' సినిమాని గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసిన రాజమౌళి.. ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ చిత్రాన్ని జపాన్‌లోనూ రిలీజ్ చేయగా అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే జపనీస్ వీడియో గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాని అప్పట్లో రాజమౌళి కలవడం చర్చనీయాంశమైంది. మహేశ్ సినిమా కోసం ఈయనతో కలిసి పనిచేయబోతున్నాడా అని అందరూ అనుకున్నారు. కానీ అవన్నీ కాదని ఇప్పుడు తేలిపోయింది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా)
కోజిమా సృష్టించిన 'డెత్ స్టాండింగ్ 2' వీడియో గేమ్‌లో రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లని పాన్ ఇండియా స్టార్స్‌ని చేసిన జక్కన్న.. ఇప్పుడు ఇంటర్నేషనల్ వీడియో గేమ్ కనిపించి తానే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. వీడియో గేమ్‌లో కనిపించిన భారతీయ తొలి సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మహేశ్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ కోసం త్వరలో కెన్యా వెళ్లి రానున్నారని తెలుస్తోంది. అలానే రూ.50 కోట్లు ఖర్చు పెట్టి.. హైదరాబాద్‌లోనే వారణాసి సెట్ వేశారని, ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే గానీ మహేశ్ సినిమా మొదలైన తర్వాత ఇప్పటివరకు రాజమౌళి.. ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. మరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు చెబుతాడో ఏంట?
(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)
#DeathStranding2 video game featuring SSR! 👍
pic.twitter.com/HsdS4wZh0N— idlebrain jeevi (@idlebrainjeevi) June 24, 2025
Tags : 1