ప్రభాస్‌.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి

Published on Mon, 06/16/2025 - 13:50

లవ్‌, యాక్షన్‌, ఫాంటసీ, మైథాలజీ.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas). అయితే హారర్‌ జానర్‌ను మాత్రం టచ్‌ చేయలేదు. ప్రేమకథా చిత్రం మూవీ చూసిన ప్రభాస్‌కు అలాంటి హారర్‌ మూవీ ఒకటి చేయాలని కోరిక పుట్టింది. ఆ సమయంలో మారుతి కలవడం, కథ చెప్పడం, అది నచ్చడంతో ది రాజా సాబ్‌ సెట్స్‌ మీదకు వెళ్లింది. అయితే మారుతి డైరెక్ట్‌ చేసిన చివరి చిత్రం పక్కా కమర్షియల్‌ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. 

అభయమిచ్చిన ప్రభాస్‌
అలాంటి సమయంలో పాన్‌ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని దర్శకుడు వెనకడుగు వేశాడు. తర్వాతెప్పుడైనా చూద్దామని వాయిదా వేయాలనుకున్నాడు. కానీ, ప్రభాస్‌ ఒప్పుకోలేదు. కథ నచ్చిందని.. ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతో మారుతి (Director Maruthi) రెట్టింపు జోష్‌తో రాజా సాబ్‌ (The Raja Saab Movie) తెరకెక్కించాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కానుంది.

ఇద్దరు హీరోయిన్లు కావాలి
సోమవారం (జూన్‌ 16న) రాజాసాబ్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ప్రభాస్‌ సరదాగా మాట్లాడుతూ.. సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా? అని అడిగాడు. సలార్‌లో ఉన్న కథానాయిక ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ఏడీలో కూడా ఒకమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. ఆదిపురుష్‌లోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది. 

ఇద్దరేం ఖర్మ.. ముగ్గురిని తీసుకొచ్చిన డైరెక్టర్‌
నా దగ్గర, నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్‌.. ఇద్దరు హీరోయిన్లను పెడతావా? అన్నాడు. అప్పుడు ఆయన్ను ఎగాదిగా చూసి మీ రేంజ్‌కు ఇద్దరేంటి? ముగ్గుర్ని పెడతానన్నాను. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్‌ కొంపలో పెట్టాను. ఇది రొమాంటిక్‌ హారర్‌ ఫాంటసీగా తెరకెక్కించాను అని మారుతి చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు పాపం.. ప్రభాస్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీలను చాలా మిస్సవుతున్నట్లున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్‌ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు.

చదవండి: సీక్రెట్‌ చెప్పిన శోభిత.. ట్రోలర్స్‌కు కౌంటర్‌?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)