Breaking News

కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?

Published on Thu, 03/13/2025 - 12:47

దిగ్గజ కమెడియన్‌ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో వీరిద్దరూ తాతామనవళ్లుగా యాక్ట్‌ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషించగా ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించాడు. సావిత్రి, ఉమేష్‌ కుమార్‌ సమర్పణలో ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ, మసూద సినిమాల ఫేమ్‌ రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహాలో రేపటి (మార్చి 14) నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

కథేంటంటే?
బ్రహ్మ అలియాస్‌ బ్రహ్మానందం (రాజా గౌతమ్‌) ఓ థియేటర్‌ ఆర్టిస్ట్‌. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన లక్ష్యం. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీలో ఓ నాటకం వేసే ఛాన్స్‌ దొరుకుతుంది. అయితే అక్కడ పాల్గొనాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్‌ చేస్తాడు. 

దానికోసం ప్రయత్నాలు చేసే క్రమంలో వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెప్తాడు. అది ఇవ్వాలంటే ఓ కండీషన్‌ పెడతాడు. మరి బ్రహ్మకు ఆ భూమి దక్కిందా? అతడిన ఎంతో ప్రేమించే తార (ప్రియ వడ్లమాని) తనను వదిలి ఎందుకు వెళ్లిపోయింది? చివరకు కలిశారా? బ్రహ్మ నటుడయ్యాడా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)