Breaking News

'రాజ్ తరుణ్‌తో విడిపోవడానికి అతనే కారణం'.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య!

Published on Mon, 02/03/2025 - 16:00

లావణ్య రాజ్ తరుణ్ కేసులో  కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. దీంతో నార్సింగి  పోలీసులు అతన్ని అదుపులోకి  తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు..

పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు వచ్చాయి.  ఏకాంతంగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను  మస్తాన్ సాయి  రికార్డ్ చేశాడు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

(ఇది చదవండి: రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్‌.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)

అసలేం జరిగిందంటే..

టాలీవుడ్‌లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం గతేడాది సంచలనంగా మారింది. రాజ్‌ తరుణ్‌ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్‌ పెద్ద దుమారం రేగింది.  ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్‌ తరుణ్‌కు రిలేషన్‌ ఉందని గతంలో  లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్‌ తరుణ్‌ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి