Breaking News

సమంత- రాజ్‌ డేటింగ్‌ వార్తలు.. దర్శకుడి భార్య పోస్ట్‌ వైరల్!

Published on Wed, 07/09/2025 - 16:02

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో తనపై వచ్చిన రూమర్స్‌పై ఇప్పటికీ వరకు స్పందించని సామ్.. తాజాగా మరోసారి దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో కలిసి సన్నిహితంగా ఉంటూ కనిపించింది. గతంలోనే విమానంలో తన భుజంపై వాలిపోయి మరి ఫోటోలకు పోజులిచ్చిన సమంత.. ఇప్పుడు ఏకంగా అతనే సమంత భుజంపై చేయి వేసుకుని అమెరికాలోని డెట్రాయిట్‌ వీధుల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో వీరిద్దరి డేటింగ్‌లో ఉన్నది నిజమేనంటూ నెట్టింట వైరలవుతోంది. ఇక అఫీషియల్ ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పోస్టులు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి డేటింగ్‌ వార్తలొస్తున్న వేళ.. రాజ్ నిడిమోరు భార్య మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసింది. సామ్- రాజ్ ఫొటోలు వైరల్‌గా మారిన తర్వాత ఆయన భార్య శ్యామాలి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ మేసేజ్‌ రాసుకొచ్చింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని రాసుకొచ్చింది. అందులో వివిధ మతాల అర్థాలను వివరిస్తూ "లైఫ్స్ గ్రేట్ గోల్డెన్ రూల్" అనే శీర్షికతో పోస్ట్ చేసింది. ఆ తర్వాత అర్జునుడు, కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించింది. అర్జునుడు.. విజయం, ఓటమి కాకుండా మరొకటి ఏంటి? అంటే.. శ్రీకృష్ణుడు ధర్మం మాత్రమే ముఖ్యమని చెప్పాడని అనే అర్థం వచ్చేలా స్టోరీస్‌లో రాసింది. అంటే తనకు ధర్మమే అండగా నిలుస్తుందని అందులోని సారాంశం. సమంత- రాజ్ డేటింగ్ వార్తల వేళ శ్యామలి చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సామ్‌ - రాజ్‌ ఫొటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని.. అందుకే ఆమె ఈవిధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని కొందరు భావిస్తున్నారు.

shaymali


అయితే రాజ్‌ నిడిమోరుకు భార్య శ్యామలితో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్‌.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్‌ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)