సమంత, రాజ్‌ పెళ్లి .. బ్రేకింగ్‌ న్యూస్‌ కోసం ఎదురుచూడొద్దు: శ్యామాలి

Published on Thu, 12/04/2025 - 12:02

నటి సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు వివాహం తర్వాత   నెటిజన్లు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్‌  మాజీ భార్య శ్యామాలి (Shhyamali) పట్ల చాలామంది సానుభూతి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో తాజాగా ఆమె ఒక పోస్ట్‌ చేశారు.  తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చాలామంది తన ఇంటర్వ్యూల కోసం అడుతున్నారని చెప్పారు. అయితే, తాను ఈ అవకాశం ఎవరికీ ఇవ్వనని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిలో తన నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌లతో పాటు  ఇంటర్వ్యూలు ఎవరూ ఆశించవద్దని కోరారు. సమంత - రాజ్‌ నిడిమోరు వివాహ గురించి తాను  పట్టించుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

సమంత- రాజ్‌ల వివాహం తర్వాత తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని శ్యామాలి ఇప్పటికే ఒక పోస్ట్‌ చేశారు. చాలా మంది నాపై అభిమానం చూపారు. వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఎవరి గురించి మాట్లాడే పరిస్థితిలో లేను. మా గురువు గారు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. నా సోషల్‌మీడియా ఖాతాను కూడా నేనే మెయిన్‌టెన్‌ చేస్తాను. అందుకోసం నేను పీఆర్‌ను పెట్టుకోలేదు. మా గురువు గారి ఆరోగ్యం పట్ల ఇప్పటికే చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా అలసిపోయాను. కాబట్టి ఎవరూ కూడా నా నుంచి బ్రేకింగ్‌లు ఆశించకండి. ఆపై ఇంటర్వ్యూల కోసం ఎదురుచూడకండి.' అని శ్యామాలి కోరారు.
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)