Breaking News

సమంత పోస్ట్‌పై వివాదం.. మద్దతుగా నిలిచిన నటుడు!

Published on Fri, 07/05/2024 - 16:13

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలాగే ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సామ్‌ నెట్టింట సలహాలు ఇస్తోంది. అయితే ఇటీవల సమంత చేసిన పోస్ట్‌ వివాదానికి దారితీసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్‌ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

అయితే సామ్ సలహాను ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా "ది లివర్ డాక్" తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని ఆయన అన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్‌ చేశాడు. అయితే సమంత కూడా దీనిపై స్పందించింది. ఓ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది.

తాజాగా ఈ విషయంపై నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ స్పందించాడు. సామ్‌కు మద్దతుగా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. సమంత ట్యాగ్‌ చేసిన డాక్టర్‌ని మీరు డిబేట్‌కి ఆహ్వానించి ఉంటే బాగుండేందని అన్నారు. మనలో చాలా మందిలాగే సైన్స్ నిరక్షరాస్యురాలనడంలో సందేహం లేదు.. కానీ ఆమె చికిత్స తీసుకునే ముందు దాని గురించి కచ్చితమైన పరిశోధనలు చేసే వ్యక్తి అని తెలిపారు. అంతే కాదు సమంతకు అర్హత కలిగిన వైద్యుడే ఈ చికిత్సను సూచించాడని.. అందుకే ఆమె దానిని సిఫార్సు చేసిందని ట్విటర్‌లో రాసుకొచ్చారు. 
 

రాహుల్‌ తన ట్వీట్‌లో రాస్తూ..'మనకు అందరిలాగే ఏది సరైందో తెలియదు. అర్హత కలిగిన వైద్యులే భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అనిపించినప్పుడు.. మనం ఇలాంటి సలహాలపైనే ఆధారపడతాం. ఇలాంటి థెరపీని ఆమె తీసుకుంటున్నది తప్ప.. నాకు దాని గురించి ఎలాంటి విషయాలు తెలియవు. ఒకవేళ ఆమెకు అది మంచిది కాకపోతే... నేనే తనను హెచ్చరిస్తా. నేను కూడా దయగల చాలా మంది వైద్యులను చూశా. చికిత్స అవసరమయ్యే పేషంట్‌కు ఇది ఎంత అవసరమో తెలుసు. ' పోస్ట్ చేశారు.

ఒక వైద్యుడిగా ఈ సమాచారాన్ని బయటపెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ.. తోటి వైద్యుడితో డిబేట్‌ పెట్టి ఉంటే బాగుండేది. మీరు ప్రజలకు సలహాలు సూచించే వైద్యులు అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. అంతే కాదు దాని ప్రభావం గురించి కథనాలను ప్రచురించాలి. కోవిడ్ వ్యాక్సిన్‌ల నుంచి సైన్స్‌పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు... సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నభిప్రాయాలు ఉంటే... మనం ఎవరిని నమ్మాలి?' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయంలో సమంతకు రాహుల్‌ రవీంద్రన్‌ మద్దతుగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)