Breaking News

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రేసులో టాలీవుడ్‌ హీరో

Published on Thu, 05/16/2024 - 07:23

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ తెలిపింది. దీంతో టీమ్‌ఇండియాకు హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగుతాడా..? లేదా కొత్త కోచ్‌ వస్తారా..? అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెడ్‌ కోచ్‌ పదవికి బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందుకు అర్హతలు, బాధ్యతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నింపాలని తెలిపింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అందరికీ అందుబాటులో వెబ్‌సైట్‌ను బీసీసీ ఉంచింది. దీంతో చాలామంది నెటిజన్లు సరదాగా భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ స్క్రీన్‌ షాట్స్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పడంలేదు.

అయితే, టాలీవుడ్‌ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. కానీ, తన దరఖాస్తును బీసీసీఐ రిజక్ట్‌ చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ అప్లికేషన్‌ను నింపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో తనకు చాలా సరదాగా అనిపించిందని ఆయన అన్నారు. ' నేను ఒకసారైనా టీమ్‌ఇండియాకు హెడ్‌ కోచ్‌గా ఉండాలనుకుంటున్నాను.' అని రాహుల్ రవీంద్రన్ అన్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)