Breaking News

OTT: రాధికా ఆప్టే బోల్డ్‌ మూవీ ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ రివ్యూ

Published on Wed, 04/30/2025 - 16:30

రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

ఫ్రెండ్‌ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద  చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్‌ చేసేది ఫ్రెండ్‌ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్‌ పటేల్‌) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్‌ సమీపంలో ఉన్న యోంగానాబాద్‌ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్‌ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత  రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్‌ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్‌ని హత్య చేయాల్సి వస్తుంది.  ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్‌ (జిమ్‌ సర్భ్‌) తనతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి  మారుపేర్లతో , దొంగ పాస్‌పోర్ట్‌లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్‌ హత్య కారణంగా ఈ కిడ్నాప్‌ రెండు దేశాల  మీడియాలో వైరల్‌ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్‌  భయపడతాడు,  సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్‌ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన  జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్‌ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్‌–క్రైమ్‌–రొమాంటిక్‌ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

జై పాత్రలో మిస్టీరియస్‌  ప్రొఫెషనల్‌ కిల్లర్‌గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్‌ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్‌లో బాలకృష్ణ సరసన హీరోయిన్‌) ఈ సినిమా హాలీవుడ్‌ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్‌ హీరోయిన్‌లా  రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్‌ సీన్లలో ఆమె దాదాపు  పూర్తి న్యూడ్‌గా కనిపించడం విశేషం.

హాలీవుడ్‌ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్‌ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్‌ సీన్స్‌ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ థ్రిల్లింగ్‌ మూమెంట్లను ఎలివేట్‌ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్‌ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం  వల్ల ఎక్కడా బోర్‌ కొట్టదు. ఐఎమ్‌డిబి 6.0 రేటింగ్‌ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్‌ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)