Breaking News

డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న బాలకృష్ణ హీరోయిన్..!

Published on Fri, 03/07/2025 - 16:48

రక్త చరిత్ర, లెజెండ్, లయన్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తర్వాత అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తోంది. గతేడాది మేరీ క్రిస్‌మస్‌, సిస్టర్ మిడ్‌నైట్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం లాస్ట్‌ డేస్ అనే మూవీలో కనిపించనుంది.

ఇదిలా ఉండగా తాజాగా రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. త్వరలోనే రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తెరకెక్కించబోయే కోట్యా అనే ఓ యాక్షన్‌ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ-సీహెచ్‌డీ వెల్లడించిది. ఈ సినిమాను నిర్మాత విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా..రాధికా ఆప్టే ప్యాడ్‌మ్యాన్, అంధాధున్, విక్రమ్ వేద, ఎ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అటు బాలీవుడ్‌.. ఇటు కోలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా నటించిన సిస్టర్ మిడ్‌నైట్‌ బాఫ్టాకు నామినేట్ అయింది.  అంతేకాకుండా సిస్టర్ మిడ్‌నైట్ గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. కాగా..  రాధికా ఇటీవల భర్త బెనెడిక్ట్ టేలర్‌తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా  వేదికగా పంచుకుంది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)