Breaking News

15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే..

Published on Tue, 09/09/2025 - 15:32

కోలీవుడ్‌ స్టార్‌ దంపతులు శరత్‌కుమార్‌- రాధిక (Radhika Sarathkumar) తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్‌లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్‌ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్‌కుమార్‌ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. 

అందుకే ఇల్లు మారాం
ప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది.  కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మా ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇల్లు మారాం. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చాడు. శరత్‌కుమార్‌ చివరగా 3BHK సినిమాలో కనిపించాడు. గణేశ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ సైతం 3BHK మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

పర్సనల్‌ లైఫ్‌
రాధిక.. 1985లో నటుడు ప్రతాప్‌ పోతన్‌ను పెళ్లాడింది. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్‌ వ్యక్తి రిచర్డ్‌ హార్డీని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్‌కుమార్‌కు ఇది రెండో పెళ్లి! ఈయన మొదటగా 1984లో చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్‌కుమార్‌ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు. రాధిక- శరత్‌ జంటకు రాహుల్‌ జన్మించాడు.

చదవండి: మిరాయ్‌.. టికెట్‌ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)