Breaking News

వాళ్లు పెద్దోళ్లు.. ఖుష్బూపై అలిగిన సీనియర్ నటుడు

Published on Sat, 07/04/2026 - 16:42

ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ కుమార్తె అవంతిక పెళ్లి.. కొన్నిరోజుల క్రితం గోవాలో జరిగింది. దీనికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ వేడుకకు తనని పిలవకపోవడంపై సీనియర్ నటుడు రాధారవి అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)

'ఖుష్బూ కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ల స్థాయి చాలా పెద్దది అయిపోయిందో ఏమో నాకు తెలీదు. కనీసం సుందర్ అయినా పిలుస్తారని అనుకున్నాను. కానీ ఆయన కూడా ఆహ్వానించలేదు. వాళ్ల కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంది కదా పెళ్లికి తప్పకుండా పిలుస్తారని అనుకున్నాను. సుందర్.. మధురై నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన బయలుదేరేముందు శుభాకాంక్షలు చెప్పింది నేనే. అయినా పెళ్లికి పిలవలేదు. బహుశా కొందరినే పిలవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. నన్ను పిలిచి ఉండే తప్పకుండా వెళ్లేవాడిని. ఎన్నికల టైంలో మాత్రం నా మద్ధతు అవసరమైంది. ఇప్పుడు అవసరం లేకపోయి ఉండొచ్చు' అని రాధారవి అన్నారు.

రాధా రవికి ఖుష్బూ, సుందర్.సితో చాలా ఏళ్లుగా అనుబంధముంది. ఖుష్బూతో కలిసి చిన్న తంబి, అన్నామలై, మన్నన్ సినిమాల్లో ఈయన నటించారు. సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై, అరణ్మనై 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 

(ఇదీ చదవండి: నాగబంధం vs రావు బహదూర్.. తొలిరోజు ఎవరికి ఎన్ని కోట్లు?)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)