Breaking News

కార్మికుల సమ్మె.. అక్కడివరకు పరిస్థితి రానివ్వొద్దు: నారాయణమూర్తి

Published on Sat, 08/16/2025 - 21:15

గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలు 30 శాతం మేర పెంచాలని వర్కర్స్ కోరగా.. నిర్మాతలు వైపు నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. ఇలాంటి టైంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్పందించారు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు..

(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్‌లీ కారు కొన్న నటుడు సౌబిన్)

'సినీ కార్మికులు.. నిర్మాతలు కలసి చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కార్మికులు అడుగుతున్న వేతనాలు నిర్మాతలు పెంచాలి. కార్మికులను గౌరవిస్తూ వాళ్ల హక్కులను కాపాడాలి. మూడు యూనియన్లకు వేతనాలు పెంచకుండా మిగతా యూనియన్లకు పెంచడం ఏమిటి? అందరితోపాటు వాళ్లకు పెంచాలి. నిర్మాతలు కోరుతున్న ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ 9 నుంచి 9 గంటల విషయమై కార్మికులు కూడా ఆలోచించాలి. ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో 6 నుంచి 6 గంటల వరకు నిర్మాతలకు ఇబ్బంది అవుతోంది అందుకే ఫెడరేషన్ కూడా ఆలోచించాలి'

'త్వరగా ఇరువురు సమ్మె విరమించి మళ్లీ షూటింగ్స్‌తో కళకళ లాడాలి. కార్మికులు చర్చల ద్వారా సమస్య  పరిష్కారం కాకపోతే నిరాహారదీక్ష చేస్తాం అని ఫెడరేషన్ సంఘాలు అంటున్నాయి. అక్కడివరకు పరిస్థితి రాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి' అని నారాయణమూర్తి చెప్పారు. మరి ఇండస్ట్రీలోని ఈ సమస్యకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్‌కి వింత అనుభవం)

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)