Breaking News

32 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా మారిన 'పుష్ప' సింగర్‌

Published on Tue, 05/30/2023 - 08:25

నటనకు వయసుతో పనిలేదు అన్నది మరోసారి రుజువైంది. ఒక టీవీ ఛానల్‌ నిర్వహించిన సూపర్‌ సింగర్స్‌ పోటీలో విజేతలుగా నిలిచి కప్పు గెలుచుకున్న దంపతులు సెంథిల్‌, రాజ్యలక్ష్మి. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి గాయకులుగా రాణిస్తున్నారు. కాగా ఇప్పుడు గాయని రాజ్యలక్ష్మి కథానాయకిగా అవతారం ఎత్తారు. ఈమె కథానాయకిగా నటించిన చిత్రం లైసెన్స్‌. జేఆర్‌జీ ప్రొడక్షనన్స్‌ పతాకంపై ఎన్‌. జీవానందం నిర్మించిన ఈ చిత్రానికి గణపతి బాలమురుగన్‌ దర్శకత్వం వహించారు.

ఇందులో రాజ్యలక్ష్మితోపాటు నటుడు రాధారవి, ఎన్‌. జీవానందం, విజయ్‌ భారత్‌, పళ.కరుప్పయ్య, గీత కై లాసం, అభి నక్షత్ర తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. కాశీ విశ్వనాథన్‌ ఛాయాగ్రహణం, బైజు జేకప్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, నిర్మాత టి.శివ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

అదేవిధంగా నిర్మాత జీవానందం ప్లస్‌ టూ క్లాస్‌మెట్స్‌ అయిన 40 మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. కాగా ఈ వేదికపై కథానాయకగా పరిచయం అవుతున్న గాయని రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 32 ఏళ్ల వయసులో ఇద్దరి పిల్లల తల్లి అయిన తాను కథానాయకగా నటిస్తానని ఊహించలేదన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఫోన్‌ చేసి లైసెన్స్‌ చిత్రం కథను చెప్పారన్నారు.

కథ విన్న తర్వాత ఇందులో తాను ఏం చేయాలని అడగ్గా మీరే కథానాయకి అని చెప్పారన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో తాను నటించగలనా అనే సందేహాన్ని వ్యక్తం చేయగా ఈ కథలో ఇతర పాత్రలకు చాయిస్‌ ఉంది గానీ.. కథానాయకి పాత్రకు మీరు తప్ప వేరే చాయిస్‌ లేదని దర్శకుడు చెప్పారన్నారు. ఒక మంచి కథా చిత్రంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)