ఇండియన్‌ బాక్సాఫీస్ రూలర్‌గా 'పుష్ప'రాజ్.. తొలిరోజు ఎన్ని కోట్లంటే?

Published on Fri, 12/06/2024 - 18:26

అల్లు అర్జున్‌- సుకుమార్‌ పుష్ప2 చిత్రంతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశారు. భారత సినీ చరిత్రలోనే భారీ రికార్డ్‌ను బన్నీ క్రియేట్‌ చేశాడు. ఇండియాలో ఇప్పటి వరకు మొదటిరోజు కలెక్షన్స్‌ సాధించిన చిత్రాలలో ఆర్‌ఆర్‌ఆర్‌ రూ. 223 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఈ రికార్డ్‌ను ఇప్పుడు పుష్ప కొట్టేశాడు. బాక్సాఫీస్‌ వద్ద తన బ్రాండ్‌ సత్తా ఏంటో ఈ చిత్రం ద్వారా బన్నీ చూపించాడు.

డిసెంబర్‌ 4 రాత్రి నుంచి థియేటర్లలో పుష్ప రూల్‌ ప్రారంభమైంది. కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌, బాలీవుడ్‌, ఓవర్సీస్‌లలో టాప్‌లో కొనసాగుతోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో కూడా తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శించింది. ఇలా తొలిరోజు పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వసూలు చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వాటా ఉంటే ఆ తర్వాత బాలీవుడ్‌ ఉంది.  అమెరికాలోనే సుమారు రూ. 35 కోట్ల వరకు రాబట్టినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది.

భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్‌
భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్‌ రికార్డ్స్‌ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్‌ డే నాడు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన ఇండియన్‌ చిత్రాల జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉండేది.. ఇప్పుడు  ఆ రికార్డ్‌ను బీట్‌ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్‌ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్‌2 (రూ. 160 కోట్లు),లియో  (రూ. 148 కోట్లు), ఆదిపురుష్‌ (రూ. 140 కోట్లు),  సాహో (రూ. 130 కోట్లు), జవాన్‌ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.

బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ను దాటేసిన అల్లు అర్జున్‌
బాలీవుడ్‌లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్‌ 'జవాన్‌' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఇప్పటి వరకు ఉంది. అయితే, తాజాగా 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్‌ డే రూ.72 కోట్ల నెట్‌ రాబట్టి ఫస్ట్‌ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ టాప్‌  టెన్‌ లిస్ట్‌లో టాలీవుడ్‌ నుంచి పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. పుష్ప తర్వాతే బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్‌ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.

(ఇది చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)

బుక్‌మైషోలో 'పుష్ప'గాడి రికార్డ్‌
'పుష్ప 2'ని డాల్బీ,  ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేశారు.  బన్నీ (అల్లు అర్జున్‌) దెబ్బకు ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డ్స్‌ అన్ని బద్దలైపోతున్నాయి. బుక్‌ మై షోలో ఒక గంటలో అత్యధికంగా లక్షకు పైగానే టికెట్లు విక్రయించి రికార్డు క్రియేట్‌ చేసింది. ఇప్పటిదాకా ప్రభాస్‌ 'కల్కి' పేరుతో ఉన్న రికార్డ్‌ అల్లు అర్జున్  ‘పుష్ప 2’  అధిగమించింది. 'పుష్ప 2' భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ల అడ్వాన్స్  బుకింగ్‌ను అధిగమించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్‌ కొల్లగొడుతుందో చూడాలి.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)