Breaking News

అఖండ 2 అంతకుమించి ఉంటుంది: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట

Published on Tue, 12/02/2025 - 00:57

‘‘అఖండ 2: తాండవం’ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి భారతదేశం అంతా విడుదల చేయాలని భావించాం. అయితే పాన్‌ ఇండియా కోసం  ప్రత్యేకంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది పాన్‌ ఇండియా కంటెంట్‌ అయినప్పటికీ సినిమా మాత్రం గ్లోబల్‌గా అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. బాలయ్య, బోయపాటిగారి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అంతకుమించి ‘అఖండ 2’ ఉంటుంది’’ అని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు. బాలకృష్ణ, సంయుక్తా మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారితో మేము చేసిన ‘లెజెండ్‌’ పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వేరే కథ అనుకున్నప్పటికీ ‘అఖండ 2’ని ముందుకు తీసుకెళ్లాం. బాలయ్యగారితో పనిచేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. బోయపాటిగారు అహర్నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాలని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా క్లైమాక్స్‌ని కాశ్మీర్లో చేయాల్సింది.

ఆ సమయంలో పెహెల్గాం దాడి జరగడంతో షూటింగ్‌ అనుమతి రాలేదు. ఈ కారణంగా జార్జియాలో మైనస్‌ డిగ్రీ చలిలో చిత్రీకరించాం. మా సినిమా 2డీ, 3 డీలో ఒకేసారి రిలీజ్‌ అవుతోంది. మా సినిమాకి ప్రజెంటర్‌ తేజస్విని ప్రమోషన్‌కి సంబంధించి మంచి సజెషన్స్  ఇచ్చారు. సంయుక్తది హీరోయిన్‌ క్యారెక్టర్‌లా కాకుండా ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్రలానే ఉంటుంది. ‘అఖండ’లో ఉన్న పూర్ణగారి పాత్ర ‘అఖండ 2’లోనూ కంటిన్యూ అవుతుంది.

తమన్‌గారి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆడియన్స్ ని మెస్మరైజ్‌ చేస్తాయి. ‘అఖండ 3’ చేసే అవకాశం ఉంది. ఆది పినిశెట్టిగారు అద్భుతమైన పెర్ఫార్మర్‌. ఇందులో ఆయన పాత్ర చాలా చక్కగా వచ్చింది. తన పాత్రకి 200శాతం న్యాయం చేశారాయన. ‘టైసన్‌ నాయుడు’ సినిమాని ఒకటి రెండు నెలల్లో రిలీజ్‌ చేస్తాం. ప్రస్తుతం కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులతో రెండు ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాం. అలాగే ఒక పెద్ద సినిమా చర్చల్లో ఉంది’’ అని చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)