ఇంతకన్నా అవమానం ఉంటుందా?: నిర్మాత ఎమోషనల్‌

Published on Wed, 11/26/2025 - 10:26

ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్‌ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్‌ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్‌ రాజ్‌, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్‌ మీట్‌ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్‌, బివిఎస్‌ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దొంగల్లా పరిగెట్టారు
ఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్‌ అవగానే సడన్‌గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్‌లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్‌ చెడిపోదా? ఒక ఫిలింమేకర్‌కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?

గుండెల్లో పెట్టుకున్నారు
మావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్‌ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: దర్శకుడు సంపత్‌ నంది ఇంట తీవ్ర విషాదం

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)