కన్‌ఫ్యూజన్‌కు ఫుల్‌స్టాప్‌.. ఆ స్టార్‌ హీరోతోనే త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత హింట్‌!

Published on Wed, 06/11/2025 - 15:39

టాలీవుడ్ స్టార్‌ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్‌-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్‌ కోసం మరో డైరెక్టర్‌ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్‌- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్‌ చేసిన త్రివిక్రమ్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.

అయితే ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్లాన్‌ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్‌లో మరో స్టార్‌ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్‌తో ప్లాన్‌ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్‌ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో  నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు.  ఈ పోస్ట్‌తో ఎన్టీఆర్‌తోనే త్రివిక్రమ్‌ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.

ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్‌ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్‌వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్‌, రామ్ చరణ్‌తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్‌డేట్స్‌ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్‌తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
 

 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)