Breaking News

అమితాబ్‌ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్‌

Published on Sun, 06/30/2024 - 00:04

‘‘అమితాబ్‌ బచ్చన్‌గారు లెజెండ్‌. మేము సెట్స్‌లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్‌ వేడుకలో నా కాళ్లకి అమితాబ్‌గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్‌. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.

ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్‌ మాట్లాడుతూ– ‘‘నాగ్‌ అశ్విన్‌ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్‌ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్‌ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్‌ల ఎపిసోడ్‌ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్‌గోపాల్‌ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్‌గారు ఎంటరైన తర్వాత పార్ట్‌ 2 డిసైడ్‌ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్‌ 2 వచ్చే ఏడాది జూన్‌లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్‌ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్‌గారి అబ్బాయి రోషన్‌తో ఓ సినిమా, దుల్కర్‌ సల్మాన్‌తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌