Breaking News

నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం

Published on Thu, 10/02/2025 - 11:12

టాలీవుడ్‌లో సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన మూడో కూతురు స్రవంతి నిశ్చితార్థం.. హైదరాబాద్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కడా ఈ విషయం పెద్దగా కనిపించలేదు. ఒకటి రెండు ఫొటోలు బయటకు రావడంతో దీని గురించి అంతా తెలిసింది.

(ఇదీ చదవండి: త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన)

వైజయంతి ప్రొడక్షన్ తరఫున సినిమాలు తీస్తూ వచ్చిన అశ్వనీదత్.. కొన్నేళ్ల క్రితం సైలెంట్ అయిపోయారు. తర్వాత ఈయన కూతుళ్లు స్వప్న, ప్రియాంక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర చిత్రాలతో మళ్లీ తండ్రి నిర్మాణ సంస్థని రేసులోకి తీసుకొచ్చారు. గతేడాది వచ్చిన 'కల్కి'తో పాన్ ఇండియా లెవల్లోనూ హిట్ కొట్టారు.

అయితే అశ్వనీదత్ పెద్ద కూతురు స్నప్న, రెండో కూతురు ప్రియాంక, అల్లుడు నాగ్ అశ్విన్ గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయితే ఈయన మూడో కూతురు స్రవంతి గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలీదు. తండ్రి అక్కలు నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ ఈమెకు ఇండస్ట్రీతో సంబంధం లేనట్లే కనిపిస్తుంది. ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో ఈమె గురించి తెలిసింది. మరి పెళ్లి కూడా ఈ ఏడాదిలో ఉంటుందేమో!

(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)