Breaking News

పవన్‌ కల్యాణ్‌తో నటించే అవకాశం వచ్చినా చేయను!: హీరోయిన్‌

Published on Tue, 01/17/2023 - 12:39

హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనంతపురానికి చెందిన ప్రియాంక మన తెలుగుమ్మాయి కావడం విశేషం. ‘టాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె. ఆ వెంటనే ‘తిమ్మరసు’,‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఫలితంగా ఆమెకు సినిమా ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం అడపదడపా చిత్రాలు చేస్తూ కెరీర్‌ను నెట్టుకొస్తుంది.

చదవండి: టీమిండియాతో జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌!

ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరో పవన్‌ కల్యాన్‌కు అభిమానిని అని చెప్పుకునే ప్రియాంక ఆయనతో మాత్రం నటించనంటూ షాకింగ్‌ కామెంట్స్‌. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలన్ని చూస్తాను. ‘తమ్ముడు’ సినిమాని దాదాపు 20 సార్లు పైగా చూశాను. ఇక ఖుషి సినిమా అయితే చెప్పనక్కర్లేదు. ఆ మూవీలోని ప్రతి డైలాగ్ నేను అలవోకగా చెప్పేస్తాను. అంత స్టార్‌డమ్ ఉన్నా ఆయన మాత్రం ఆర్డినరీ మ్యాన్‌లా, చాలా సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు అసలు అర్ధం కాదు’ అంటూ అభిమానం చాటుకుంది.

చదవండి: కాకినాడలో వాల్తేరు వీరయ్య టీం సందడి!

ఆ తర్వాత యాంకర్‌ ఆయనతో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని అడగ్గా.. ప్రియాంక ఆసక్తికరంగా స్పందించింది. ‘ఓ అభిమానిగా ఆయనను దూరం నుంచి చూస్తు మురిసిపోతాను. అంతకు మించి ఏం కోరుకోవడం లేదు. ఆయనతో కలిసి నటించాలనే కోరిక నాకు లేదు. ఒకవేళ పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిన చేయను. చేయలేను కూడా’ అంటూ షాకింగ్‌ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె సమాధానం విని అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఆమె బాలకృష్ణ సినిమాలో ఆఫర్లు కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రియాంకను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)