Breaking News

'ఆమెను చూసి ఇన్‌స్పైర్ అ‍య్యా'.. మహిళపై ప్రియాంక చోప్రా ప్రశంసలు

Published on Wed, 03/19/2025 - 17:05

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్‌ మూవీతో బిజీగా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్‌ అడ్వెంచరస్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఒడిశాలోని కోరాపుట్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తి కావడంతో ప్యాకప్ చెప్పేశారు. దీంతో చిత్రబృందంతో పాటు ప్రియాంక చోప్రా ముంబయికి ప్రయాణమైంది. 

అయితే తాజాగా ఇవాళ షూటింగ్ లోకేషన్ నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా దారిలో ప్రకృతి అందాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అందులో ప్రియాంక చోప్రా ఓ వీడియోను కూడా పంచుకుంది. ఓ మహిళను చూసి తాను ఇన్‌స్పైర్‌ అయ్యానని తెలిపింది. ఆమె తనలో స్ఫూర్తి నింపిందని కొనియాడింది. అందుకే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవాలనిపించిందని తెలిపింది.

(ఇది చదవండి: SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్)

వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను ఇలా తరచుగా చేయను. కానీ ఈరోజు ఎందుకో నాకు చాలా స్ఫూర్తినిచ్చే సంఘటన ఎదురైంది. నేను ముంబయికి వెళ్లేక్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తున్నా. వైజాగ్‌ ట్రాఫిక్‌లో  ఓ మహిళ జామపండ్లు అమ్ముతుండటం చూశాను. నాకు కచ్చా (పచ్చి) జామపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెంటనే ఆమెను ఆపి మీ జామపండ్లన్నింటికీ  ఖరీదు ఎంత? అని అడిగాను. ఆమె 150 రూపాయలు అని చెప్పింది. నేను తనకు 200 రూపాయల నోటు ఇచ్చా. కానీ ఆమె నాకు చిల్లర ఇవ్వడానికి ప్రయత్నించింది.  వద్దు.. దయచేసి మీరే ఉంచుకోండి అని తనతో అన్నా. ఎందుకంటే జీవనోపాధి కోసం ఆమె జామపండ్లు అమ్మింది. కానీ ట్రాఫిక్‌లో గ్రీన్ సిగ్నల్‌ పడేలోపే ఆమె తిరిగి వచ్చి నాకు మరో రెండు జామపండ్లు ఇచ్చింది. అంటే ఆ మహిళ నా నుంచి ఎలాంటి దాతృత్వాన్ని కోరుకోలేదు. ఆమె తీరు నిజంగా నన్ను కదిలించింది' అని పంచుకుంది.

ఈ వీడియోతో పాటు ఎస్ఎస్ఎంబీ29 సెట్‌లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉ‍న్న ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది.   ఇది 2019 లో విడుదలైంది. ఇటీవల సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు మూవీలో నటిస్తోంది.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)