Breaking News

ఇండియాకు ప్రియాంక చోప్రా.. అలా రావడం తొలిసారి!

Published on Fri, 03/31/2023 - 16:24

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు.  బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.  ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. అక్కడ రాజకీయాలు భరించలేకే హాలీవుడ్‌కు మారిపోయానని తెలిపింది. 

అయితే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా అమెరికన్‌ సింగర్‌, నటుడు నిక్‌ జొనాస్‌, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది.  తాజాగా కూతురు, భర్తతో కలిసి తొలిసారిగా ఇండియాకు ప్రియాంక చోప్రా వచ్చారు. నిక్ జోనాస్, ప్రియాంక కుమార్తె మాల్తీ మేరీ  శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు.

 నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కోసం వారు ముంబయికి వచ్చినట్లు సమాచారం. కాగా.. తన కూతురు మాల్తీని భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.  గతంలో కొన్ని ఫోటోలు షేర్‌ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. ఇటీవలే జొనాస్ బ్రదర్స్‌ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీ ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)