Breaking News

ఆ డైరెక్టర్‌ లోదుస్తులు చూపించమన్నాడు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

Published on Wed, 05/24/2023 - 15:40

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు.  బాలీవుడ్‌ పలువురు స్టార్‌ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు)

అయితే ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది. 2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. 

ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది. 

(ఇది చదవండి: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)