వారణాసి బడ్జెట్‌ అన్ని కోట్లా?.. ప్రియాంక చోప్రా క్రేజీ ఆన్సర్!

Published on Sun, 12/21/2025 - 13:46

దర్శకధీరుడు రాజమౌళి- ‍ప్రిన్స్ మహేశ్‌బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్‌ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్‌ ప్రకటించేందుకే భారీ ఈవెంట్‌ నిర్వహించారు. గ్లోబ్‌ట్రాటర్‌ పేరుతో ఈవెంట్‌ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. 

అయితే ఈ మూవీ బడ్జెట్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్‌ఆర్‌కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ‍అడ్వెంచరస్‌ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.

ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్‌పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్‌ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్‌ స్పందిస్తూ.. అంటే బడ్జెట్‌లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)