ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!
Breaking News
గాయత్రి మంత్రం జపించిన వారణాసి భామ కూతురు.. క్యూట్ వీడియో వైరల్
Published on Fri, 11/20/2026 - 08:08
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ ముద్దుగుమ్మ రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న వారణాసిలో కనిపించనుంది. ఈ మోస్ట్ అడ్వెంచరస్ మూవీలో మహేశ్ బాబు సరసన కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. వీఎఫ్‌ఎక్స్ పనులతో బిజీగా ఉన్నారు టీమ్. అనుకున్న టైమ్‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ముందుకెళ్తున్నారు.
ఈ సంగతి పక్కనపెడితే బాలీవుడ్ భామ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటోంది. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే దీపావళి తన భర్త, కూతురితో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా మరో ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు, వీడియోలను పంచుకుంది ప్రియాంక. ఇందులో ఆమె ముద్దుల కూతురు గాయత్రిమంత్రం జపిస్తూ కనిపించింది. ప్రియాంక కూతురు ఎంతో క్యూట్‌గా గాయత్రి మంత్రం జపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tags : 1