Breaking News

సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా.. కూతురిని ఎలా రెడీ చేసిందో చూశారా?

Published on Thu, 02/06/2025 - 20:01

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి  మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.

మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..

రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్‌ రోల్‌ కాదని.. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న విలన్‌ రోల్‌ చేయనున్నారనే మరో టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)