Breaking News

'ప్లీజ్ అన్నా.. సినిమాలు ఆపేయ్'.. నెటిజన్‌కు ప్రియదర్శి స్ట్రాంగ్ కౌంటర్!

Published on Thu, 11/20/2025 - 21:01

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా  చిత్రం 'ప్రేమంటే'. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటించింది.  ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

మూవీ రిలీజ్‌కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్‌. అయితే ఓ నెటిజన్‌ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు. అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్న.. ప్లీజ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మరి ఏం చేయమంటావ్? గడ్డి  పీకమంటావా? అంటూ ప్రశ్నించాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్‌ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రేమంటే కథేంటంటే..?

మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. 
 

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)