Breaking News

‘కూలీ’ కోసం హాలీడే, ఫ్రీ టికెట్‌.. ఇది కదా రజనీ క్రేజ్‌!

Published on Tue, 08/12/2025 - 13:36

రజనీకాంత్‌ సినిమా వస్తుందంటే చాలు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ సంబరాలు మొదలవుతాయి. జపాన్‌, మలేషియా, సింగపూర్‌ లాంటి దేశాల్లో రజనీకాంత్‌కు ఫుల్‌ ఫ్యాన​్‌ ఫాలోయింగ్‌ ఉంది.ఇక ఇండియాలో చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాక అంతటా ఆయనకు అభిమానులు ఉన్నారు. తొలి రోజు ఆయన సినిమా చూసేందుకు వేలల్లో ఖర్చు పెట్టిమరీ టికెట్‌ కొనేవాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమా రిలీజ్‌ రోజు చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీస్‌కి సెలవు పెడతారు. బాస్‌కి ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజు ఆఫీస్‌కి డుమ్మా కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా ఎందుకు అనుకుందో ఏమో కానీ..ఓ కంపెనీ ఏకంగా తమ ఉద్యోగస్తులకు హాలీడేనే ప్రకటించింది. 

(చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)

సౌత్‌తో పాటు ఇండియా వ్యాప్తంగా పలు బ్రాంచ్‌లు కలిగి ఉన్న ఓ ప్రైవేట్‌ కంపెనీ రజనీకాంత్‌ కొత్త సినిమా ‘కూలీ’(Coolie Movie) రిలీజ్‌ రోజు(ఆగస్ట్‌ 14) తమ ఉద్యోగులకు వేతనంతో కూడా సెలవును ప్రకటించింది. అంతేకాదు రిలీజ్‌ రోజు తమ ఎంప్లాయిస్‌కి ఉచితంగా టికెట్‌ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది.దీంతో పాటు రజనీకాంత్‌ 50 ఏళ్ల సినీ కెరీర్‌ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ కంపెనీపై తలైవా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

(చదవండి: రెమ్యునరేషన్‌తో ఆర్‌ నారాయణ మూర్తిని కొనలేం: త్రివిక్రమ్‌)

కూలీ విషయానికొస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)