Breaking News

ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్

Published on Mon, 06/15/2026 - 15:37

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా టెక్నో థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ స్టోరీతో వెబ్ సిరీస్ సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దీనికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈయన కొడుకు వీర్ హిరానీ ఇందులో లీడ్ రోల్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీసిన ఈ సిరీస్ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వీర్ హిరానీ లీడ్ రోల్ చేయగా.. అర్షద్ వార్షీ, విక్రాంత్ మస్సే, బొమన్ ఇరానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.

ట్రైలర్ బట్టి చూస్తే.. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని పెడ్రో(అర్షద్ వార్సీ) అనే పోలీస్ అధికారి.. ఓ కేసు కారణంగా మంత్రి దెబ్బకు సైబర్ డిపార్ట్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. మరోవైపు ప్రీతమ్ అనే కుర్రాడు టెక్నాలజీలో జీనియస్. 15 నిమిషాల్లోనే సెల్‌టవర్‌ని హ్యాక్ చేయగలడు. కానీ నిజ జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముతుంటాడు. అయితే పెడ్రో ట్రాన్స్‌ఫర్‌కి కారణమైన మంత్రి కొడుకు కిడ్నాప్ అవుతాడు. రూ.23 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇదంతా చేసింది పేరు మోసిన మరో హ్యాకర్ అని పెడ్రో, ప్రీతమ్ తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)