Breaking News

బాలీవుడ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు

Published on Sun, 01/25/2026 - 18:04

సౌత్‌ టు నార్త్‌.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్‌ రాజ్‌. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్‌లో కేరళ లిటరేటర్‌ ఫెస్టివల్‌కు ప్రకాశ్‌ రాజ్‌ హాజరయ్యాడు. 

సహజత్వం లేదు
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్‌లా ఉంటుంది.. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి. 

ఫోకస్‌ అంతా దానిపైనే
దళితుల సమస్యలను తమిళ యంగ్‌ డైరెక్టర్స్‌ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక బాలీవుడ్‌ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్‌, రీల్స్‌, ప్రమోషన్స్‌.. వీటిపైనే ఫోకస్‌ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.

చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్‌ ఇచ్చిన నటి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)