దురంధర్‌-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్‌ రాజ్‌ రియాక్షన్ ఇదే..!

Published on Fri, 03/20/2026 - 19:51

రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్‌ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్‌ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్‌ మరో అద్బుతమైన కంటెంట్ ‍అందించారని.. రణ్‌వీర్ సింగ్‌ ‍అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్‌ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు.  ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్‌కు ప్రకాశ్ రాజ్‌ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్‌ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతకుముందు ప్రకాశ్ రాజ్‌ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. నేను దురంధర్‌కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని  'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్‌ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.

కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. 
 

 

Videos

ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన

రోడ్లపైకి టెస్లా సెమీ ట్రక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 KM

పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?

ప్లాన్ మార్చిన అమెరికా.. ట్రంప్ టార్గెట్ ఏంటంటే?

షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా భాద అనిపించలేదా తల్లి..?

చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ

మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్ళకు సగం ఆస్తి పంచాడా...?

ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

యుద్దానికి ముగింపు..? హంటింగ్ ఆఫ్ హార్మూజ్

Photos

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)