నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
పవన్ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ మరో సూటి ప్రశ్న
Published on Fri, 09/27/2024 - 11:15
తనని తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకొంటున్న పవన్ కల్యాణ్‌కి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వరస షాకులు ఇస్తున్నాడు. గత రెండు రోజులుగా ట్విటర్‌లో ప్రకాశ్ రాజ్-పవన్ మధ్య పెద్ద వార్ జరుగుతోంది. తాజాగా మరో ట్వీట్ చేసి పవన్ కల్యాణ్ తీరుని ఎండగట్టారు. మనకేం కావాలి అని ప్రశ్నిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని లేవనెత్తారు.
(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)
ట్వీట్‌లో ఏముంది?
'మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చాడు.
ఏం చెప్పాలనుకున్నారు?
ప్రకాశ్ రాజ్ గత ట్వీట్స్‌తో పోలిస్తే ఈసారి పవన్ కల్యాణ్ తన మాటలతో ప్రజల భావోద్వేగాలని ఎలా రెచ్చగొడుతున్నారో అనేది చెప్పకనే చెప్పారు. దీని ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారా అని పవన్‌ని సూటిగా ప్రశ్నించారు. మరి ఈ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: 'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి)
మనకేం కావాలి...
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?
లేక ప్రజల మనోభావాలు
గాయపడకుండా..పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..?
జస్ట్ ఆస్కింగ్ #justasking— Prakash Raj (@prakashraaj) September 27, 2024
Tags : 1