Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
Breaking News
ఓటీటీలో డ్యూడ్.. రెండు రోజుల్లోనే నంబర్‌వన్‌గా!
Published on Sun, 11/16/2025 - 13:01
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపావళి సందర్భంగా గత థియేటర్లలోకి వచ్చిన డ్యూడ్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 14 నుంచే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ బాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్‌వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. కాగా.. మమిత బైజు హీరోయిన్‌గా కనిపించగా.. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
'Supreme Star' @realsarathkumar's BTS from the sets of #DUDE ❤🔥#Dude TRENDING #1 on @NetflixIndia 🔥
Now streaming in Tamil, Telugu, Kannada and Malayalam 🤩
⭐ing 'The Sensational' @pradeeponelife
🎬 Written and directed by @Keerthiswaran_
Produced by @MythriOfficial… pic.twitter.com/xHrUBVxyU8— Mythri Movie Makers (@MythriOfficial) November 16, 2025
Tags : 1