Breaking News

కుటుంబంతో స్వామివారిని దర్శించిన ప్రభుదేవా, పాప పుట్టాక తొలిసారి..

Published on Sat, 07/22/2023 - 12:40

సాక్షి, తిరుపతి: నటుడు, కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ ప్రభుదేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రభుదేవా, ఆయన భార్య హిమాని, తమ పాపతో పాటు తండ్రి సుందరం మాస్టరుతో కలిసి సాధారణ భక్తులు నిలబడే క్యూ లైనులో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

మొదటి పెళ్లి- విడాకులు
కాగా ప్రభుదేవా గతంలో రమాలత్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించగా అందులో ఓ అబ్బాయి చిన్నవయసులోనే మరణించాడు. తర్వాత హీరోయిన్‌ నయనతారతో ప్రభుదేవా సన్నిహితంగా మెదలడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. తర్వాత ప్రభుదేవా 2020లో ఫిజియోథెరపిస్ట్‌ హిమానీ సింగ్‌ను పెళ్లాడాడు. గత నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ వార్తలు వచ్చాయి.

50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రైన ప్రభుదేవా
దీనిపై ప్రభుదేవా సైతం స్పందిస్తూ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యానని, ఇప్పుడే జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. కొంతకాలంపాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని భావిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన కూతురి ఫోటోను మాత్రం సోషల్‌ మీడియాలో ఎక్కడా చూపించలేదు. తాజాగా అతడు భార్యాపిల్లలతో కలిసి తిరుమలలో కనిపించడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ప్రభుదేవాతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు.

చదవండి: శివజ్యోతిని అక్కా అంటూనే ఇలాంటి కామెంట్లా?

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)