Breaking News

ప్రభాస్ ది రాజాసాబ్.. ఎవరికెంత రెమ్యునరేషన్‌..!

Published on Fri, 01/02/2026 - 17:14

ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ మూవీ రిలీజ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డామని స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి.

అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో.. తాజాగా ఈ మూవీ ‍స్టార్స్‌ రెమ్యునరేషన్‌పై కూడా చర్చ మొదలైంది. ఈ సినిమాకు ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, హీరోయిన్స్‌ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్‌ తన రెగ్యులర్‌ రెమ్యునరేషన్‌ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్‌ రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.

ఎవరికి ఎంతంటే?

మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజాసాబ్‌ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ చిత్రానికి డైరెక్టర్‌ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)