Breaking News

రాజాసాబ్‌: 'రాజే.. యువరాజే' సాంగ్‌ రిలీజ్‌

Published on Thu, 01/01/2026 - 08:58

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' సినిమాతో 2026కి స్వాగతం పలుకుతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్‌ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, సాంగ్స్‌తో సోషల్‌మీడియాలో మంచి హైప్‌ వచ్చింది. కొత్త ఏడాది సందర్భంగా ది రాజాసాబ్‌ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ వదిలారు. 

రాజే యువరాజే సాంగ్‌
'రాజే యువరాజే' పాటను రిలీజ్‌ చేశారు. ఎటువంటి విజువల్స్‌ లేకుండా కేవలం ఆడియో సాంగ్‌ మాత్రమే బయటకు వదిలారు. తమన్‌ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్‌ లిరిక్స్‌ సమకూర్చారు. ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఒకేరోజు రెండు సర్‌ప్రైజ్‌లు
కాగా ప్రభాస్‌ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం స్పిరిట్‌. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ వదిలారు. అందులో డార్లింగ్‌ ప్రభాస్‌ ఒంటి నిండా గాయాలు, కట్లతో కనిపించాడు. అయితే ప్రభాస్‌ను ముందువైపు నుంచి చూపించకుండా బ్యాక్‌సైడ్‌ ఫోటో మాత్రమే వదిలారు. దెబ్బలతో ఉన్న ప్రభాస్‌ ఓపక్క సిగరెట్‌, మరోపక్క మందు తాగుతున్నట్లుగా ఆ పోస్టర్‌ ఉంది. ఇది చూసిన డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)