Breaking News

అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

Published on Tue, 12/30/2025 - 19:52

ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి నిన్న మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన దానికంటే ఇందులో కథని మరింత రివీల్ చేశారు. విజువల్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. దీని దెబ్బకు మూవీపై హైప్ కూడా కాస్త పెరిగింది. ట్రైలర్‌కి హిట్ టాక్ రావడం ఏమో గానీ దర్శకుడు మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. మారుతి ఇంటికి ఓ సర్‌ప్రైజ్ పంపించారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో 'రాజాసాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసిన తనని విమర్శించొచ్చని చెబుతూ కొండాపూర్‌లోని తన ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు.

(ఇదీ చదవండి: చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్)

లేటెస్ట్ ట్రైలర్ చూసి తెగ సంబరపడిపోతున్న ప్రభాస్ అభిమానులు.. మారుతి ఇంటికి బిర్యానీ పార్సిల్స్ పంపిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తన ట్విటర్‌లో బయటపెట్టాడు. ఓ ఫొటో కూడా పోస్ట్ చేశాడు. ట్రైలర్‍‌కే ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్నారంటే.. మూవీ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకెన్ని పార్సిల్స్ పంపిస్తారో ఏంటో?

'రాజాసాబ్' మూవీ జనవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ముందురోజు రాత్రి అంటే 8వ తేదీన రాత్రి ప్రీమియర్ల వేయనున్నారు. ఈ సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు