Breaking News

'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం

Published on Fri, 09/12/2025 - 10:44

రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల్లో కచ్చితంగా డివోషనల్ ఎలిమెంట్స్ లేదా క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు కొన్నింటిని దాస్తుంటే మరికొన్నింటిని మాత్రం ముందే రివీల్ చేస్తున్నారు. కానీ తాజాగా థియేటర్లలో రిలీజైన 'మిరాయ్'లో మాత్రం ప్రభాస్ నటించాడనే రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఓ ఫొటో కూడా సర్కూలేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన సినిమా 'మిరాయ్'. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్‪‌తోనే తీశారు. మంచు మనోజ్ విలన్ కాగా.. ఇందులో రాముడి రిఫరెన్స్‌ కూడా ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేసుంటారా అని అందరూ మాట్లాడుకున్నారు. అలానే నిన్న రాత్రి తేజ్ సజ్జా.. సినిమాలో ప్రభాస్ సర్‌ప్రైజ్ కూడా ఉందని ట్వీట్ చేశాడు. దీంతో ఏంటా సంగతి అనుకున్నారు.

(ఇదీ చదవండి: ‍'కిష్కింధపురి' సినిమా రివ్యూ)

అయితే సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్.. ప్రభాస్‌తో చెప్పించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రభాస్‌ని రాముడిగా ఎడిట్ చేసి థియేటర్ స్క్రీన్‌పై ఆ బొమ్మని పెట్టేశారు. దీంతో చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదో ఎడిటెడ్ ఫొటో. 'మిరాయ్' చిత్రం కోసం ప్రభాస్.. తన గొంతు మాత్రమే ఇచ్చాడు. ఇదే నిర్మాణ సంస్థ 'రాజాసాబ్' తీస్తుంది.

ప్రస్తుతం 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. కానీ తొలిరోజు వచ్చే టాక్ కాదు, ఒకటి రెండు రోజుల తర్వాత అసలు టాక్ వస్తుంది. అప్పుడు సినిమా రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.

(ఇదీ చదవండి: మిరాయ్‌ ట్విటర్‌ రివ్యూ)

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)