Breaking News

ఆ డైరెక్టర్‌ భార్యను కొడితే కోమాలోకి వెళ్లింది: పూనమ్‌ కౌర్‌

Published on Wed, 01/07/2026 - 13:58

టాలీవుడ్‌ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ సినిమాల కంటే ఎక్కువ సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్‌ అయింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. తనకు నచ్చిన విషయాలనే ఓపెన్‌గా మాట్లాడడం.. పాలిటిక్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీ విషయాలపై కూడా స్పందించడం పూనమ్‌కు అలవాటు. ఆమె చేసే పోస్టులు కొన్ని కాంట్రవర్సీగా, చర్చనీయాంశంగానూ మారాయి. 

పలుమార్లు ఆమెపై ట్రోలింగ్‌ కూడా నడిచింది. అయినా కూడా పూనమ్‌ తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చిత్ర హింసలకు గురి చేశాడంటూ పూనమ్‌ చేసిన వ్యాఖ్యలు  టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్‌ టాపిక్‌గా మారాయి.

(చదవండి: ఎన్నో దారుణాలు చూశా.. నాకు విలువ లేదు.. అందుకే విడాకులు!)

తాజాగా పూనమ్‌(Poonam Kaur ) ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది.  ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి వివరిస్తూ..సోషల్‌ మీడియాలో చేసే పోస్టులపై గురించి కూడా మాట్లాడింది. 'మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు. అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అంటూ  గతంలో పూనమ్‌ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా..దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఆమె వివరించింది.

‘నేను ఊరికే సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టను. నా హార్ట్‌కు టచ్‌ అయిన విషయాల గురించే మాట్లాడుతుంటాను. మీకు తెలుసా... ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె ఐదారు రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది.  అన్యాయం జరిగినా ఆ మహిళ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు ఇదంతా జరిగిన తర్వాత కూడా సినిమా ఈవెంట్లకు భర్తతో కలిసి హాజరైంది. ఆ దర్శకుడి సినీ జీవితం గురించి ఆమె ఆలోచించి.. హీరోయిన్‌తో పెట్టుకున్న సంబంధం గురించి బయటకు చెప్పలేదు.  ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాకయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను’ అని పూనమ్‌ చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడు, హీరోయిన్‌ ఎవరనేది మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా? అనే చర్చ కొనసాగుతోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)