Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్‌ సెల్వన్‌-2'.. కానీ కండీషన్స్‌ వర్తిస్తాయి

Published on Fri, 05/26/2023 - 10:36

లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రలో నటించారు.కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించగా, గత నెలలో రెండో భాగం విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. కానీ రెంట్‌ విధానంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ప్రైమ్ మెంబర్ షిప్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి సినిమాను చూడొచ్చు. అయితే డబ్బులు కట్టిన 48 గంటల్లోనే సినిమాను చూడటం పూర్తిచేయాలి. మిగిలిన కండీషన్స్‌ కూడా వర్తిస్తాయి.

తమిళంతో పాటు తెలుగు సహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. జూన్‌ రెండో వారం నుంచి మాత్రం అమెజాన్‌ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఉచితంగా పొన్నియ‌న్ సెల్వ‌న్ -2 అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)