Breaking News

ప్రముఖ సింగర్‌ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్‌

Published on Wed, 10/01/2025 - 09:19

ప్రముఖ గాయకుడు, కింగ్‌ ఆఫ్‌ హమ్మింగ్‌ జుబీన్‌ గార్గ్‌ (Zubeen Garg) మృతి కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. నార్త్‌ ఈస్ట్‌ ఇండియా ఫెస్టివల్‌ (NEIF) నిర్వాహకుడు శ్యాంకను మహంత, జుబీన్‌ గార్గ్‌ మేనేజర్‌ సిద్దార్థ శర్మను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్‌లో ఈవెంట్‌ ముగించుకుని వచ్చిన మహంతను న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లో, సిద్దార్థ శర్మను గురుగ్రామ్‌లోని అతడి అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్‌ చేశారు. విచారణ కోసం వీరిద్దరినీ గౌహతికి తీసుకెళ్లినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి మీడియాకు వెల్లడించారు.

సింగర్‌ అనుమానాస్పద మృతి
సింగపూర్‌లో జరిగిన నార్త్‌ ఈస్ట్‌ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబీన్‌.. సెప్టెంబర్‌ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్‌ జాకెట్‌ లేదు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగర్‌ మృతికి కారణమైనవారిని వదిలేది లేదని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.

ఎవరీ జుబీన్‌ గార్గ్‌?
జుబీన్‌ గార్గ్‌ అసలు పేరు మోహిని మోహన్‌. 1972 నవంబర్‌ 18న అస్సాంలో జన్మించారు. తల్లి గాయని, తండ్రి కవి కావడంతో ఇద్దరి ప్రతిభను అందిపుచ్చుకుని మంచి గాయకుడిగా మారారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్‌ మెహతా అంతటివాడు కావాలని జుబీన్‌ గార్గ్‌ అని పెట్టుకున్నారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. సింగర్‌గానే కాకుండా రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.

చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)