మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..
Breaking News
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
Published on Mon, 03/23/2026 - 07:25
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.
సాంగ్ రిలీజ్
తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు.
సినిమా
రొమాంటిక్ వైబ్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.
Tags : 1