Breaking News

అఫిషియల్‌.. ఓటీటీలోకి ‘పెద్ది’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!

Published on Sat, 07/04/2026 - 13:35

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’.  బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 4న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 9 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌.. సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడిస్తూ వివరాలను పంచుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. 

 ‘పెద్ది’ కథేంటంటే.. 
1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో  రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్‌ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్‌లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్‌ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్‌) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్‌ వరకు వెళ్తాడు. మరి నేషనల్‌ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది?  కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి?  అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్‌),  రామ్‌ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)