కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!
Breaking News
'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు
Published on Sun, 04/26/2026 - 21:22
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూన్లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు గానీ తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అందులో చేసే బ్యూటీ ఎవరు? తదితర వివరాలపై స్పష్టత రాకపోయేసరికి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)
ధనుష్ 'కర' సినిమా ఈనెల 30న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు.. జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. అలానే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని చెప్పాడు. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో 'పెద్ది' తీస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు తదితరుల ఇతర పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)
#Peddi - 25th June 🔒#RamCharan pic.twitter.com/Jnrer2KFrY
— Suresh PRO (@SureshPRO_) April 26, 2026
Tags : 1