'పెద్ది' మళ్లీ వాయిదా నిజమే.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

Published on Mon, 03/30/2026 - 20:30

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరోసారి వాయిదా పడింది. మీరు విన్నది నిజమే. గత కొన్నిరోజుల నుంచి ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. టీమ్ మౌనవ్రతం పాటిస్తుండగా.. అభిమానుల మాత్రం అలాంటిదేం ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం ఏం చెప్పనప్పటికీ.. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్, సోమవారం సాయంత్రం జరిగిన ఓ మూవీ ఈవెంట్‌లో మాట్లాడుతూ 'పెద్ది' కొత్త విడుదల తేదీని బయటపెట్టేశాడు.

(ఇదీ చదవండి: తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?)

మార్చి 27న చరణ్ పుట్టినరోజున 'పెద్ది' రిలీజ్ చేస్తామని తొలుత అనౌన్స్ చేశారు. తీరా డేట్ దగ్గరపడేసరికి ఏప్రిల్ 30న వస్తామని అన్నారు. కానీ ఐటమ్ సాంగ్‌తో పాటు మరో పాట షూటింగ్ పెండింగ్‌లో ఉండటం, ఈ మధ్యే చరణ్ కంటికి గాయం కావడం తదితర అంశాలతో చెప్పిన తేదీకి రావడం కష్టమే అని అంతా భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే లీకులు వచ్చేస్తున్నాయి.

జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇది రిలీజ్ అవుతుందని అఖిల్ 'లెనిన్'ని జూన్ 26కి వాయిదా వేశారు. మరి 'పెద్ది' తప్పుకొంది కాబట్టి 'లెనిన్'.. ముందే చెప్పినట్లు మే 1న థియేటర్లలోకి వస్తాడా లేదంటే మరో తేదీ చూసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

'పెద్ది' తప్పుకొంటే అదే తేదీకి వచ్చేయాలని నిఖిల్ 'స్వయంభు' సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అదే టైంలో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', ధనుష్ 'కర'తో పాటు పలు చిత్రాలు లైనులో ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్ని అదే తేదీని టార్గెట్ చేసుకుంటాయో చూడాలి? ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలేం లేవు. ఇప్పుడు 'పెద్ది' కూడా తప్పుకొంది. దీంతో ఈసారి కూడా స్టార్స్ లేకుండానే సమ్మర్ ఉండబోతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు

బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

కుర్రాడు మంచోడే కానీ... ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడు..!

అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?

దళిత ఉద్యోగిపై బూతులు.. పిఠాపురం కమీషనర్ ఆడియో లీక్

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!

పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత

ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..

Photos

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

గ్రీన్‌ అవుట్‌ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)