Breaking News

'పెద్ది' మూవీ మరో రికార్డ్

Published on Wed, 06/17/2026 - 17:54

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా మరో ఘనత సాధించింది. ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు కలెక్షన్లలో రూ.400 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. పోస్టర్‌ని సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు.

(ఇదీ చదవండి: ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం)

విలేజీ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్.. క్రికెటర్, రెజ్లర్, పారా రన్నర్‌గా కనిపించాడు. విడుదలకు ముందు చాలానే హైప్ ఏర్పడింది గానీ టాక్ మాత్రం తేడా కొట్టేసింది. సినిమా చూసిన చాలామంది రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందని మెచ్చుకున్నారు కానీ కథ పరంగా లోటుపాట్లు ఎత్తిచూపారు. మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రని చూపించిన విధానంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంతో అనుకున్నంత వసూళ్లు రాలేదనేది వాస్తవం.

జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన సీన్స్ తీసేశారు. దర్శకుడు బుచ్చిబాబు కూడా సారీ చెప్పాడు. ఇలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చిన 'పెద్ది' సినిమా ఎట్టకేలకు రూ.400 కోట్ల కలెక్షన్ల మార్క్‌ని అయితే దాటేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ఇది ఘనత సాధించింది. మరి రూ.500 కోట్లు వస్తాయా అంటే సందేహమే. ఎందుకంటే థియేటర్లలో ఈ చిత్రం హవా దాదాపుగా తగ్గిపోయింది. మరో రెండు వారాలు ఆగితే ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. అదే టైంలో స్కూల్స్ కూడా తెరిచేశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం పెద్దగా లేదని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు